Human Rights Forum

మానవ హక్కుల వేదిక
Press Statements (Telugu)

దేవరగట్టు బన్నిఉత్సవంలో పల్లకి కోసం జరిగిన ఘర్షణ మీద స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి
దేవరగట్టు బన్నిఉత్సవంలో పల్లకి కోసం జరిగిన ఘర్షణలో ఇద్దరు మృతిచెంది, వందమందికి పైగా, కాళ్ళు, చేతులు విరిగి, కాలిన గాయాలతోను, మూగగాయల పాలు కావడానికి రాష్ట్రప్రభుత్వం, అందులో భాగమైన జిల్లా రెవిన్యూ పోలీసుల భద్రతావైఫల్యం వల్లనే జరిగాయని ఆరోపణలు రావడాన్ని మానవ హక్కుల వేదిక, ఐ.యఫ్టి.యు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆలూరు తాలూకా, హొళగొంద మండలం, దేవరగట్టులో 03 అక్టోబర్, 2025 తేది తెల్లవారుజామున 1 – 2 గం మధ్యలో

జగిత్యాల రూరల్ మండల తహసీల్ కార్యాలయంలో కొనసాగుతున్న కుల వివక్ష
జగిత్యాల రూరల్ మండల తహసీల్ కార్యాలయంలో, అటెండర్ గా పనిచేస్తున్న దళిత మహిళకు జరిగిన అవమానంపై మానవ హక్కుల వేదిక కరీంనగర్ జిల్లా నుండి నలుగురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ బృందం శనివారం (27.09.2025) జగిత్యాల తహసిల్ (MRO) ఆఫీస్ కి వెళ్లి బాధిత మహిళను, నిందిత మహిళలను, ఆఫీసు బాధ్యులను కలిసి వివరాలు సేకరించింది. ఎం ఆర్ ఓ గారితోనూ వివరంగా మాట్లాడింది. తెలంగాణ ప్రభుత్వం 61
Press Statements (English)

HRF demands the immediate withdrawal of Ambuja Cements Ltd’s proposal to establish a cement grinding unit at Pedagantyada village in Visakhapatnam district
The Human Rights Forum (HRF) demands the immediate withdrawal of Ambuja Cements Ltd’s (ACL) proposal to establish a cement grinding unit with cement production capacity of 4 million metric tons per annum (MMTPA) at Pedagantyada village in Visakhapatnam district. Pushing a hazardous, highly polluting industry into the midst of a densely populated area is reckless in the extreme. It amounts to an assault on the people’s right to health, safety and a clean environment. HRF also calls upon the AP Pollution Control Board (APPCB) to cancel, without further delay, the sham public hearing slated for October 8, 2025. We believe it is a mere façade that only seeks to rubber-stamp a project that will cause irreparable harm.

Representation Against Proposed PTFE Manufacturing Facility by TGVSRAACL
Our Main Concerns
1. We were kept in the dark about dangerous chemicals
During public consultations, the company never told us about GX902, a chemical they now say they will use. We only learned about it after the Ministry asked for additional details. This chemical was never mentioned in the original application we were shown.
When we asked questions about PFOA (a banned toxic chemical), the company said they would not use it. But they did not tell us they would use other similar chemicals that are equally dangerous. This feels like we were deliberately misled.
Reports

బస్తర్ లో భద్రత అభద్రతపై పౌర నివేదిక
అభివృద్ధి పేరు మీద ఈ రోజు ఆదివాసులు ఎదుర్కొంటున్న అణచివేత ఇంతా అంతా కాదు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినప్పటికీ ఈ దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల వార్తలు ప్రాంతీయ, జాతీయ మీడియాలో చాలా తక్కువే కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బస్తర్ ప్రజల పోరాటం గురించి మనకు ఎక్కువ తెలియకపోవడానికి కూడా అదే కారణం. అందుకే అక్కడ జరుగుతున్న విషయాలను ఒక రిపోర్ట్ రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాం.

Citizens’ Report on Security and Insecurity
In the last few years, there have been several large-scale protests by Adivasi communities across the Bastar region of Chhattisgarh against security camps being set up on their lands. In some cases, these protests have been continuing for over three years. They are demanding the right to be consulted on anything that affects them, as guaranteed under the Fifth Schedule of the Constitution, as well as protesting against illegal appropriation of their lands.
Bulletins

మానవ హక్కులు-2024 ( బులెటిన్-18)
మానవహక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంది. మా 10 వ మహాసభల సందర్భంగా ఇప్పుడీ సంచికను మీ ముందుకు తెస్తున్నాము. ఈ బులెటిన్ లో వివిధ విషయాల మీద సంస్థ ఆలోచనలనూ, అవగాహననూ వివరించే వ్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకు ప్రగతిశీల న్యాయమూర్తిగా పేరున్న చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ హోదాలో న్యాయవ్యస్థను దిగజార్చిన తీరును, ఆయన ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులను ఒక వ్యాసంలో వివరించాము. గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని ఎత్తిపట్టే వ్యాసమూ, కోనసీమ జిల్లాకి అంబేడ్కర్ పేరు పెట్టడంపై అగ్రవర్ణాలు చేసిన అల్లరిని వివరించే వ్యాసమూ కూడా ఉన్నాయి. మదర్సాలలో విద్యకు దూరం అవుతున్న ముస్లిం సమాజం వెతల గురించి, హిందుత్వ భావాలతో వాట్సప్ పుకార్లను నమ్మే ఐ.టి ఉద్యోగుల దుస్థితి గురించి కూడా రాసాము.

మానవ హక్కులు-2022 ( బులెటిన్-17)
ఆచరణలో భారతీయ సమాజం ఎంతవరకు లౌకిక మార్గంలో అడుగులు వేసిందో గమనిస్తే మన సమాజంలోని అధిక సంఖ్యాకుల్లో మతాధిక్య భావన అనే చీకటి ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతాన్ని క్రమంగా అలుముకుంటున్నదని అర్థమవుతూనే ఉంది. మూడు వరుసల ముద్రాక్షరాల్లోనో, ముప్పై నిమిషాల కథనాల్లోనో సమాజపు ఈ వర్తమాన గమనాన్ని ఎత్తి చూపడానికి, విశ్లేషించడానికి, ఖండించడానికి ఇప్పుడు ఏ మీడియా సంసిద్ధత లేదు. అయినా కటిక చీకటికి అలవాటు పడ్డాక కళ్ళు అందులోనే ఒక కాంతిని చూడగలవు. సమాజాన్ని కొన్ని విలువల ప్రాతిపదికగా నిర్మించుకోవాలని తపన పడేవాళ్ళకు ఆ కాంతి ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. అప్పటిదాకా ఒక మెరుగైన సమాజం కోసం మనకు మనమే ఏర్పరచుకున్న ఆదర్శాలను ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంసలో పడకుండా వల్లిస్తూనే ఉండాలి.
Books

ప్రజా హక్కుల న్యాయవాది గొర్రెపాటి
మాధవరావు గారి విశిష్ట వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని స్మరించుకుంటూ హక్కుల రంగంలోని ఆయన సహచరులు పంచుకున్న జ్ఞాపకాలు, హక్కుల కోణంలో ఆయన రాసిన కొన్ని ముఖ్యమైన వ్యాసాలను కలిపి ఈ పుస్తకం తీసుకొచ్చాం. ఇదివరకే చెప్పినట్టు ఆయన రచనా వ్యాసంగం హక్కుల వ్యాసాలకే పరిమితం కాదు. సాహిత్య, రాజకీయ, వ్యక్తిగత ఆసక్తులతో ఆయన రాసిన మరెన్నో వ్యాసాలు పలు పత్రికలలో వచ్చాయి. అవన్నీ ఆయనకు అశేష అభిమానులను సంపాదించి పెట్టాయి కూడా. వాటిని విడిగా ఒక పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయన అకాల మరణం వల్ల ఈ కృషి అర్ధంతరంగా ఆగిపోవడం కూడా ఎంతో బాధ కలిగించే విషయం.
మాధవరావు గారు గొప్ప స్నేహశీలి. మానవహక్కుల వేదిక సభ్యులందరితోనూ ఎంతో కలివిడిగా, ప్రేమపూర్వకంగా ఉండేవారు. చమత్కార సంభాషణలతో నిత్యం నవ్వులు పూయించేవారు. ఏ క్షణంలోనైనా ఆగిపోయే గుండె అని తెలిసినా ప్రతి క్షణం అర్థవంతంగా గడపడానికే ప్రయత్నించారు. ఈ పుస్తకం ఆయనకు మేము ఇస్తున్న ప్రేమపూర్వక నివాళి. హక్కుల రంగంలో ఆయన చేసిన కృషికి ఈ పుస్తకం అద్దం పడుతుందని ఆశిస్తున్నాం.

కమిషన్ నివేదికలు-సామాజిక న్యాయం
రెండేళ్ల క్రితం ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ పుస్తకం తీసుకొచ్చాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘కమిషన్ నివేదికలు – సామాజిక న్యాయం’ తీసుకొస్తున్నాం. కోర్టు తీర్పులు చర్చించబడినంతగా కమిటీలు, కమిషన్ల నివేదికలు ప్రజాక్షేత్రంలో చర్చించబడవు. మండల్, సచార్ కమిషన్ లాంటి కొన్ని మాత్రమే దీనికి మినహాయింపు. సాధారణంగా నేరుగా లబ్ది పొందే లేదా నష్టపోయే వర్గాలు మాత్రమే ఈ నివేదికలను చదివి వాటి సిఫార్సులను అమలు చేయమనో, తిరస్కరించమనో ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంటాయి. అవే ఎక్కువగా మీడియాలో వార్తలుగా వస్తుంటాయి. అయితే బాలగోపాల్ గారు తన హక్కుల ప్రయాణం ప్రారంభ దశ నుండి ప్రజా ప్రయోజనం ఉన్నాయనుకున్న అన్ని కమిటీలకు, కమిషన్లకు చాలా ప్రాముఖ్యం ఇస్తూ వచ్చారు. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో ఏర్పాటైన కమిషన్ల నివేదికలపై కూడా స్పందిస్తూనే వచ్చారు. ప్రజాస్వామ్య సంవాదంలోనూ, సామాజిక న్యాయ సాధనలోనూ వాటి పాత్రను ఆయన గుర్తించి, గౌరవించినట్టుగా ఇంకెవరూ చేసినట్టు కనిపించదు.